Madhya Pradesh: చేతులు కట్టేసుకుని... నదిలో దూకిన ప్రేమజంట!

  • నర్మదా నదిలో దూకి ఆత్మహత్య
  • 8 రోజుల తరువాత కనిపించిన మృతదేహాలు
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

వారి ప్రేమను పెద్దలు కాదన్నారో లేక మరేదైనా కష్టం వచ్చిందేమో... ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్ లోని ఖల్ ఘాట్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న వంతెన మీద నుంచి ఓ ప్రేమ జంట నదిలోకి దూకగా, వారి మృతదేహాలు 8 రోజుల తరువాత లభ్యమయ్యాయి.

వీరి పేర్లు రాను, అరుణ్ లుగా గుర్తించారు. ఇద్దరూ సమీప బంధువులే. వీరి వద్ద ఓ ఫోటో లభించింది. ఇందులో యువతి మెడలో మంగళసూత్రం కనిపిస్తుండగా, ఇద్దరి చేతులనూ ఓ తాడుతో కట్టేసుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. మృతదేహాలను తల్లిదండ్రులు, బంధుమిత్రులు గుర్తుపట్టి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, వీరిలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియడం లేదని వాపోయారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Madhya Pradesh
Narmada River
Lover
Sucide
  • Loading...

More Telugu News