Air India: ఎయిరిండియా విమానంలో దుస్తులు విప్పేసి నగ్నంగా నడిచిన ప్రయాణికుడు.. దుప్పటికప్పి కూర్చోబెట్టిన సిబ్బంది!

  • విమానంలో ప్రయాణికుడి బిత్తిరి చర్య
  • షాక్ తిన్న ప్రయాణికులు
  • పోలీసులకు అప్పగించిన సిబ్బంది

దుబాయ్ నుంచి లక్నో వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం రేపాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా దుస్తులు విప్పేసి అటూఇటూ తిరగడం ప్రారంభించాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడి ఒంటిపై దుప్పటి కప్పి సీట్లో కూర్చోబెట్టారు.

విమానం లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడి వింత చర్యకు విమానంలోని 150 మంది ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించామని, అతడు ఎందుకు అలా ప్రవర్తించాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Air India
passenger
Mid air
Dubai
Lucknow
Air India Express flight
  • Loading...

More Telugu News