Shaun pollock: స్లిప్ క్యాచ్ గురించి చెబుతూ వంగిన షాన్ పొలాక్.. లైవ్‌లో ‘ఫట్’మని చినిగిన ప్యాంటు!

  • మైదానంలో పొలాక్‌కు చేదు అనుభవం
  • వెనక చేతులు పెట్టుకుని డ్రెస్సింగ్ రూముకు పరుగో పరుగు
  • ఇంకోసారి స్లిప్ క్యాచ్‌ల గురించి చెప్పకూడదని ట్వీట్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్‌కు లైవ్‌లో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సహచర కామెంటేటర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో కలిసి మైక్ పట్టుకుని లంచ్ బ్రేక్‌లో మైదానంలోకి వచ్చిన పొలాక్.. స్లిప్ క్యాచ్‌ల గురించి వివరించాడు. ఈ క్రమంలో క్యాచ్ ఎలా పట్టాలో చెబుతూ ఒక్కసారిగా కిందకి వంగాడు. అంతే.. అతడు వేసుకున్న ప్యాంటు ‘బర్’మని చినిగిపోయింది.

వెంటనే అప్రమత్తమైన పొలాక్ చేతులు వెనక అడ్డం పెట్టుకుని దక్షిణాఫ్రికా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూములోకి పరిగెత్తాడు. అక్కడ ప్యాంటు మార్చుకున్నాడు. ఈ ఘటన లైవ్‌లో జరగడంతో లక్షలాదిమంది నవ్వుకున్నారు. ప్యాంటు మార్చుకున్న అనంతరం పొలాక్ ట్వీట్ చేస్తూ తనకు చేంజ్ రూములో ప్యాంటు మార్చుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. ఇంకోసారి సూట్ ప్యాంటులో ఉండగా స్లిప్ క్యాచ్‌ల గురించి చెప్పకూడదని ట్వీట్ చేశాడు.

Shaun pollock
south africa
Pakistan
slip catching
Graeme Smith
  • Loading...

More Telugu News