Chennai: టికెట్ లేని మహిళలే అతని టార్గెట్... బెదిరించి కోరిక తీర్చుకుంటున్న రైల్వే టీసీ!

  • చెన్నైలో టీసీగా పనిచేసే శివకుమార్
  • లాడ్జి యజమాని సహకారంతో దందా
  • అరెస్ట్ చేసిన పోలీసులు

రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణం చేసే మహిళలు, యువతులే అతని టార్గెట్. వారిని వెతికి పట్టుకుని, టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని, ఏడాది శిక్ష తప్పదని భయపెట్టి, కేసు లేకుండా చేయాలంటే, తనతో గడపాలని బెదిరించి, వారిని ఓ లాడ్జికి తీసుకెళ్లి తన కోరికను తీర్చుకుంటున్న రైల్వే టికెట్ కలెక్టర్ పాపం పండింది.

చెన్నై పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, చిన్నతంబి వీధిలోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా, కొన్ని జంటలతో పాటు ఓ వ్యక్తి, యువతి పట్టుబడ్డారు. వారిని విచారించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై శివారు ప్రాంతంలోని తాంబరం ప్రాంతానికి చెందిన శివకుమార్‌ (43), ఎగ్మోర్ రైల్వేస్టేషన్‌ లో టీసీ. ఈ స్టేషన్ కు వచ్చే రైళ్లలో టికెట్‌ లేకుండా వచ్చే వాళ్లను వెతకడమే ఇతని పని.

ఆపై జరిమానాకు బదులు తనతో గడపాలని, లేకుంటే, కేసు పెడతానని, ఏడాది జైలు తప్పదని బెదిరించేవాడు. భయపడి అంగీకరించేవారిని స్థానిక ట్రిప్లికేన్‌ ప్రాంతంలోని లాడ్జికి తీసుకెళ్లేవాడు. లాడ్జి యజమాని శ్రీకాంత్, మేనేజర్ దేవగురు సహకారంతో అక్కడ తన కోరిక తీర్చుకునేవాడు. శివకుమార్ తో పాటు లాడ్జి యజమాని, మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Chennai
Tambaram
Ticket Collector
TC
Police
  • Loading...

More Telugu News