KCR: మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ కీలక నిర్ణయం

  • సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ
  • నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ 
  • చర్చించిన మీదటే శాఖల కేటాయింపు

మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన ఆయన మంత్రివర్గ విస్తరణ, ఢిల్లీ పర్యటన తదితర విషయాలపై చర్చించారు. సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేయాలని.. లోక్‌సభ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్టు సమాచారం.

త్వరలోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. తొలి విడత కొందరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

KCR
Narasimhan
Rajbhavan
Cabinet
Loksabha Elections
  • Loading...

More Telugu News