V.Hanumantha Rao: కోర్టు తీర్పులను అడ్డుపెట్టుకుని బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారు: వీహెచ్
- 2,500 పంచాయతీలే బీసీలకు దక్కుతున్నాయి
- కాంగ్రెస్ పక్షాన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
- కాంగ్రెస్ హయాంలో 34శాతం రిజర్వేషన్లు
కోర్టు తీర్పులను అడ్డుపెట్టుకుని తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 వేల పంచాయతీలు ఉంటే 2,500 పంచాయతీలు మాత్రమే బీసీలకు దక్కుతున్నాయని వాపోయారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పక్షాన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వీహెచ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించామని.. ప్రస్తుతం టీఆర్ఎస్ కోర్టు తీర్పు పేరుతో 22 శాతానికి పరిమితం చేసి బీసీలను అణగదొక్కేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు.