KCR: చంద్రబాబుకు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుంది: కేసీఆర్

  • చంద్రబాబు మేనేజర్ మాత్రమే
  • ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయం
  • నేను చేసేది చిల్లరగాళ్లకు అర్థం కాదు
  • అందరిపై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నా

ఏపీ సీఎం చంద్రబాబుకు తాను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నేడు ప్రగతి భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు లీడర్ కాడని.. మేనేజర్ మాత్రమేనన్నారు. ఏపీలో చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని.. ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తాను ఏం చేస్తున్నానో చిల్లర గాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజకీయంగా అందరిపై ఒత్తిడి పెంచుతున్నట్టు వెల్లడించారు. తమ అజెండా.. ఆర్థిక ప్రణాళిక ఇంకా బయటకు రాలేదన్నారు. తాను అనుకున్నది సాధించేందుకు కాస్త సమయం పడుతుందన్నారు.  

KCR
Chandrababu
Return Gift
Pragathi Bhavan
Federal Front
  • Loading...

More Telugu News