KCR: ట్యాంపరింగ్ చేసుంటే తుమ్మలను ఎందుకు పోగొట్టుకునేవాళ్లం?: కేసీఆర్

  • ట్యాంపరింగ్ చేశామని కాంగ్రెస్ ఆరోపిస్తోంది 
  • మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది
  • ట్యాంపరింగ్ చేసే గెలిచారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ స్పందించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాము ట్యాంపరింగ్ చేశామని ఆరోపిస్తున్నారని.. అలా చేసుంటే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు జరిగాయని.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేసే గెలిచిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తాము ట్యాంపరింగ్‌కు పాల్పడి ఉంటే తుమ్మలను పోగొట్టుకునే వాళ్లమా? అన్నారు. 

KCR
Congress
Tummala Nageswara Rao
Chattisgarh
Rajasthan
Madhya Pradesh
  • Loading...

More Telugu News