varun tej: 'ఎఫ్ 2' నుంచి సరదాగా సాగిపోతోన్న 'హనీ ఈజ్ ద బెస్ట్' సాంగ్

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • కామెడీ డ్రామాగా సాగే కథ
  • జనవరి 12వ తేదీన విడుదల  

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కథానాయికలుగా అలరించనున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ .. మెహ్రీన్ తదితరులపై చిత్రీకరించిన పాట ఇది.

"అయ్యా బాబోయ్ .. అయ్యా బాబోయ్ .. ఇంతకాలం నేలపైన లేదోయ్ .. అయ్యా బాబోయ్ .. అయ్యబాబోయ్ ఇంతకాలం ఎవరు చూడలేదోయ్ .. " అంటూ ఈ పాట సరదాగా సాగుతోంది. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ పాటను అనిల్ రావిపూడి ఎంతో కలర్ ఫుల్ గా చిత్రీకరించాడు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. సాంగ్స్ కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. 

varun tej
mehreen
  • Error fetching data: Network response was not ok

More Telugu News