team india: ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి చేరువలో ఇండియా!
- ఆసీస్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు
- మరో 141 పరుగులు వెనుకబడ్డ ఆస్ట్రేలియా
- రెండు వికెట్లు తీస్తే విజయం టీమిండియాదే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టును నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలన్న భారత ఆశలపై ఆసీస్ బౌలర్ కమిన్స్ నీళ్లు చల్లాడు. హాఫ్ సెంచరీని సాధించిన కమిన్స్ భారత విజయాన్ని మరో రోజుకు వాయిదా వేశాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన కమిన్స్... బ్యాంటింగ్ లో కూడా మెరవడం గమనార్హం.
ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. టెస్టును గెలుచుకోవాలంటే ఆస్ట్రేలియా మరో 141 పరుగులు సాధించాల్సి ఉంది. 2 వికెట్లను తీస్తే భారత్ విజయం సాధిస్తుంది.
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో షాన్ మార్ష్ 44, హెడ్ 34, ఖవాజా 33 పరుగులు చేసి రాణించారు. కమిన్స్ 61, లియాన్ 6 లు క్రీజులో వున్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా బుమ్రా, షమీలు చెరో రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.