nandita sweta: రాజమౌళి సినిమాలో చిన్నపాత్ర దొరికినా చాలు: నందిత శ్వేత

  • ఇకపై హారర్ సినిమాలు చేయను
  • రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేయాలనుంది
  • పవన్ కల్యాణ్ అంటే ఇష్టం

తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలలో నందిత శ్వేత మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' హిట్ కావడంతో, ఆ తరహా పాత్రలే ఆమెకి ఎక్కువగా వస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా 'బ్లఫ్ మాస్టర్' థియేటర్స్ కి రాగా, 'ప్రేమకథా చిత్రం 2' సెట్స్ పై వుంది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నందిత శ్వేత మాట్లాడుతూ .." ఇకపై హారర్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. యంగ్ హీరోలతో కలిసి రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేయాలని అనుకుంటున్నాను. కామెడీ సినిమాలు చేయడమన్నా ఇష్టమే. పవన్ కల్యాణ్ అంటే నాకెంతో ఇష్టం .. ఆయనతో కలిసి నటించాలని వుంది. ఇక ఏ దర్శకుడి సినిమాల్లో చేయాలని ఉందంటే, నా దగ్గర పెద్ద లిస్టే వుంది. ముందుగా చెప్పవలసి వస్తే మాత్రం రాజమౌళిగారి పేరే చెబుతాను. ఆయన దర్శకత్వంలో ఒక చిన్నపాత్ర అయినా చేయాలనుంది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

nandita sweta
  • Loading...

More Telugu News