Andhra Pradesh: ఒంగోలులో విద్యార్థి సజీవ దహనం కేసు.. తీవ్రంగా స్పందించిన మంత్రి గంటా!

  • ఒంగోలులో కాలి బూడిదైన రాజారెడ్డి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ సమీపంలో ఓ విద్యార్థి రెండ్రోజుల క్రితం సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన యువకుడిని రాజారెడ్డి(16)గా పోలీసులు గుర్తించారు. అనంతరం విద్యార్థి సజీవదహనంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. తాజాగా ఈ దారుణ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.

రాజారెడ్డి మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు. వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేసి నివేదికను తనకు అందించాలని సూచించారు.

Andhra Pradesh
Prakasam District
brunt alive
torched
Ganta Srinivasa Rao
angry
inter boy
dead
  • Loading...

More Telugu News