philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

  • రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదు
  • భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలో సునామీ అవకాశం
  • తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఫిలిప్సీన్స్ దక్షిణ ప్రాంతంలో ఉండే మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. జనరల్ శాంటోస్ నగరానికి ఉత్తరాన 193 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది. భూకంపం నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

philippines
earthquake
tsunami
  • Loading...

More Telugu News