Agrigold: విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష భగ్నం.. ఉద్రిక్తత!

  • తెల్లవారుజామున శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు
  • దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలింపు
  • అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులు

తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున దీక్ష స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న ముప్పాల నాగేశ్వరరావు సహా అందరినీ ఆసుపత్రికి తరలించారు. దీక్ష భగ్నం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి దీక్షకు దిగిన అందరినీ ఆసుపత్రికి తరలించారు.

అగ్రిగోల్డ్ చేతిలో దారుణంగా మోసపోయిన బాధితులు ఇటీవల తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. అందులో భాగంగానే దీక్షకు దిగారు. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ ఇటీవల అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. దీంతో భగ్గుమన్న బాధితులు హాయ్ ల్యాండ్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్ ల్యాండ్ తమదేనంటూ మాట మార్చిన విషయం తెలిసిందే.

Agrigold
Vijayawada
Andhra Pradesh
Police
Chandrababu
  • Loading...

More Telugu News