ATC: ఆకాశంలో త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఏటీసీ చాకచక్యంతో మూడు విమానాలు సేఫ్!

  • మూడు విమానాల మధ్య దూరం పది అడుగులే
  • ప్రమాదాల నియంత్రణ వ్యవస్థను అప్రమత్తం చేసిన ఏటీసీ
  • దిశ మార్చుకున్న విమానాలు

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మూడు విమానాలు గాల్లో ఒకదానికొకటి ఢీకొనేవే. అమెరికా నేషనల్  ఎయిర్‌లైన్స్‌ విమానం (ఎన్‌సీఆర్‌-840) హాంకాంగ్‌ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని బగ్రమ్‌కు వెళ్తూ 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అదే సమయంలో తైవాన్‌ విమానం ఒకటి వియత్నాం నుంచి బ్యాంకాక్ వెళ్తూ 32 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. డచ్‌కు చెందిన మరో విమానం కేఎల్ఎం -875 ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి బ్యాంకాక్ వెళ్తూ 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

ఈ మూడు విమానాలు ప్రయాణిస్తున్న ఎత్తులో తేడా ఉన్నప్పటికీ దూరం మాత్రం కేవలం 10 అడుగులే ఉండడంతో ఏటీసీ వెంటనే అప్రమత్తమైంది. మూడు విమానాల పైలట్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రమాదాల నియంత్రణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. విమానాల ఎత్తుతోపాటు దిశలను కూడా మార్చడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే గాల్లోనే మూడు ఢీకొని ఉండేవని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ATC
Flights
American national flight
dutch
Bangkok
Afghanisthan
  • Loading...

More Telugu News