Ramakrishna: ఇంటెలిజెన్స్ నివేదిక మేరకే మోదీ ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నారు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

  • ముఖం చెల్లకే మోదీ పర్యటన వాయిదా
  • మోదీ హామీలేవీ నెరవేర్చలేదు
  • ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే వాయిదా

జనవరి 6న ఏపీలో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందించారు. ముఖం చెల్లకే మోదీ పర్యటన వాయిదా పడిందని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయన్న ఇంటెలిజెన్స్ నివేదిక మేరకే మోదీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని రామకృష్ణ మండిపడ్డారు.

Ramakrishna
Narendra Modi
Andhra Pradesh
Intelligence
  • Loading...

More Telugu News