Rachakonda: చైన్ స్నాచింగ్ నిందితుల కోసం గాలింపు.. ముళ్లపొదలో దొరికిన బైక్!

  • చైన్ స్నాచర్ల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
  • బైక్‌ను అమ్మేసినట్టు తెలిపిన యజమాని
  • నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశం

నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ ఘటనలు తొమ్మిది జరగడంతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం మొత్తం చైన్ స్నాచర్ల కోసం జల్లెడ పడుతున్నారు.  ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దుండగులు వాడిన బైక్‌ను పోలీసులు గుర్తించారు. బైక్ నంబర్ ద్వారా దాని యజమానిని సంప్రదించగా అతను రెండేళ్ల క్రితమే బైక్‌ను అమ్మేసినట్టు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.

చైన్ స్నాచింగ్ అనంతరం తాము వాడిన బైక్‌ను నిందితులు ముళ్లపొదల్లో వదిలి వెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చైన్ స్నాచింగ్ ఘటనపై హోమంత్రి మొహముద్ అలీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని రాచకొండ సీపీని ఆదేశించినట్టు తెలిపారు.

Rachakonda
Mahamood Ali
CCTV
Hyderabad
Chain Snachers
  • Loading...

More Telugu News