Chandrababu: చంద్రబాబు వల్లే తెలంగాణలో ఓడిపోయాం: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • టీడీపీతో పొత్తు వల్ల చాలా నష్టపోయాం
  • చంద్రబాబు డైలాగులను ప్రజలు నమ్మలేదు
  • ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం

తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కారణంగానే తమ పార్టీ ఓటమి పాలైందని ఏపీ కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా తాము చాలా నష్టపోయామన్నారు. చంద్రబాబు చెప్పిన డైలాగులను తెలంగాణ ప్రజలు నమ్మలేదని బైరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మనుగడకే ముప్పు అని బైరెడ్డి పేర్కొన్నారు.

Chandrababu
Rajasekhar Reddy
Congress
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News