rajamouli: దర్శకుడు రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక.. తరలి వెళ్లిన తారలు!

  • ఈ నెల 30న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వివాహం
  • మూడు రోజుల పాటు వివాహ వేడుకలు
  • వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రముఖ హీరోలు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ-పూజా ప్రసాద్ ల వివాహం ఈ నెల 30న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరగనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు రాజమౌళి కుటుంబంతో పాటు టాలీవుడ్ తారాగణం జైపూర్ కు తరలి వెళ్లింది. ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, రానా, జగపతిబాబు తదితరులు బయలుదేరి వెళ్లారు. సినీనటులందరూ జైపూర్ విమానాశ్రయంలో ఉండగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి. ప్రభాస్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ విమానంలో ప్రయాణిస్తుండగా తీసిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.కాగా, ఈ వేడుక ఈరోజు వెల్ కమ్ డిన్నర్ తో ప్రారంభం కానుంది. రేపు సంగీత్, మెహెందీ వేడుకలు, ఎల్లుండి కార్తికేయ-పూజా ప్రసాద్ ల పెళ్లి జరగనుంది. కుకాస్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో జరగనున్న వీరి వివాహానికి మూడొందల మంది అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం.

rajamouli
director
karthikeya-pooja prasad
prabhas
junior ntr
ram charan
nani
rana
jagathibabu
  • Loading...

More Telugu News