Telugudesam mp: టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె వివాహానికి హాజరైన రతన్ టాటా

  • నాని కుమార్తె హైమ వివాహం పృథ్వీతో
  • హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన రతన్ టాటా

ఏపీ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె హైమ వివాహం పృథ్వీతో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ వివాహానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈరోజు రతన్ టాటా 82వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా వివాహా వేడుకల కార్యక్రమంలో అతిథుల సమక్షంలో రతన్ టాటాతో బర్త్ డే కేక్ ని కట్ చేయించారు. అనంతరం, రతన్ టాటాను వేదపండితులు ఆశీర్వదించారు. 

Telugudesam mp
Kesineni Nani
Hyderabad
golconda resorts
ratan tata
marraige function
hyma-prudhvi
  • Loading...

More Telugu News