Narasimhan: వేగంగా హైకోర్టుల ఏర్పాటు పనులు.. ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం

  • హైకోర్టు ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్
  • ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్‌కుమార్

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైకోర్టుల ఏర్పాటు పనులు ఎంత వరకూ వచ్చాయి? తదితర అంశాలను చర్చించారు.

 జనవరి 1న ఉదయం 8:30 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌, 10.30కి విజయవాడలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే గవర్నర్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News