Andhra Pradesh: విశాఖ ఎయిర్ షో రద్దుపై లోకేశ్ విమర్శలు.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్!

  • కేంద్రం తెలుగువారిని అవమానిస్తోందన్న లోకేశ్
  • తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత జీవీఎల్
  • సీఎం, లోకేశ్ చచ్చు డ్రామాలు ఆడుతున్నారని విమర్శ

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరగాల్సిన ఎయిర్ షోను రక్షణ శాఖ రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన 90 మంది సిబ్బంది ఇప్పటికే రిహార్సల్స్ నిర్వహించినా, వెంటనే వెనక్కు వచ్చేయాలని చెన్నై కార్యాలయం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తెలుగువారిని అవమానిస్తోందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. దీంతో తాజాగా మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కౌంటర్ ఇచ్చారు.

ఈరోజు జీవీఎల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘లోకేష్ బాబూ.. మీరు, మీ నాన్న గారు ప్రతి ఉదయం ‘చచ్చు డ్రామాలు’ ఆడటం మానేస్తే మంచిది. ఎవరు ఎయిర్ షోకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు Cancel చేశారు? దొంగ డ్రామాలు ఆపండి. ఎన్ని వేషాలు వేసినా మీకు ఓటమి తప్పదు. తెలంగాణలో ఫెయిల్ అయిన వ్యూహాన్నే ఆంధ్రాలో అమలు చేస్తున్న మీ తెలివితేటలు అమోఘం!’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telangana
Telugudesam
Nara Lokesh
BJP
counter
gvl narasimaharao
Twitter
Visakhapatnam District
air show
airforce
IAF
  • Loading...

More Telugu News