Andhra Pradesh: చంద్రబాబు కారణంగా మాకు 4 శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయ్.. లగడపాటి ఓ 420!: తలసాని సెటైర్లు

  • 23 మంది వైసీసీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు
  • ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతున్నారు
  • చంద్రబాబుపై నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ నేత

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు.. ఫిరాయింపుదారుల గురించి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రావడం ద్వారా చంద్రబాబు తమకు మేలు చేశాడని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మాట్లాడటం రానివాళ్లు కూడా వచ్చి ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కారణంగా టీఆర్ఎస్ కు ఓటింగ్ 4 శాతం పెరిగిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో చంద్రబాబువి చిల్లర రాజకీయాలనీ, లగడపాటి ఓ 420 అని తలసాని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చంద్రబాబు గింజుకుంటున్నారని సెటైర్లు వేశారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
TRS
Talasani
lagadapati
angry
  • Loading...

More Telugu News