Telangana: ‘మీ బతుకులు చెడ’ అని కేసీఆర్ మిమ్మల్ని ఊరికే అనలేదు!: చంద్రబాబుపై జీవీఎల్ సెటైర్లు

  • హైకోర్టు విషయంలో బాబు మాటమార్చారు
  • కేంద్రం సహకరిస్తే నీచ రాజకీయాలు చేశారు
  • ట్విట్టర్ లో మండిపడ్డ బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో మాట మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక హైకోర్టు కోసం కేంద్రం సహకరిస్తుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు విభజన తమ ఘనతేనని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మీ బతుకులు చెడ’ అని ఊరికే తిట్టలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ రోజు ట్విట్టర్ లో జీవీఎల్ స్పందిస్తూ..‘U-టర్న్ CM చంద్రబాబు @ncbn హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్రం ఆంధ్రాకు ప్రత్యేక హైకోర్టుకు సహకరిస్తే నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారు. నిన్నకు నిన్న క్రెడిట్ మాదేనని ఎంపీ కె.రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారు. మీ "బతుకులు చెడ" అని KCR ఊరికే అనలా!’ అంటూ ట్వీట్ చేశారు.

Telangana
Andhra Pradesh
Chandrababu
KCR
gvl narasimaharao
High Court
BJP
Twitter
  • Loading...

More Telugu News