hanu raghavapoodi: టైటిల్ పై కౌంటర్లు వేయడం కరెక్ట్ కాదు!: దర్శకుడు హను రాఘవపూడి
- నేను ఎదుగుతోన్న దర్శకుడిని
- నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే
- అందరినీ మెప్పించడం ఎవరి వల్లా కాదు
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో దర్శకుడు హను రాఘవపూడి పాల్గొన్నారు. "పడి పడి లేచె మనసు' సినిమా టైటిల్ కి తగినట్టుగానే పడి పడి లేచింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది?" అనే ప్రశ్న హను రాఘవపూడికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .." రివ్యూలు రాసేవాళ్లు ప్రాస కోసమన్నట్టుగా అలా వాడుతున్నారు. రివ్యూ అనేది విశ్లేషణాత్మకంగా ఉండాలి .. ఆ విశ్లేషణ .. నేర్చుకునేదిలా ఉండాలి.
ఒక రివ్యూను నేను చూశాను .. 'పడింది మళ్లీ లేవలేదు' అని రాశారు. మనం చేసే పని ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుందని నేను ఎప్పుడూ నమ్మను. అలా అందరినీ మెప్పించడం బ్రహ్మ దేవుడి వలన కూడా కాదు. నన్ను నేను కరెక్ట్ చేసుకునేలా రివ్యూలు ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. ఎదగడంకోసం ఏదైనా నేర్చుకోవడానికి నేను రెడీగా వున్నాను. టైటిల్ పై కౌంటర్లు వేయడమే కరెక్ట్ కాదని అంటాను .. అంతే" అని చెప్పారు