hanu raghavapoodi: మణిరత్నం ప్రభావం నాపై లేదు: దర్శకుడు హను రాఘవపూడి
- మణిరత్నం గారి శైలి వేరు
- కావాలని అలా తీయడం లేదు
- నా ముద్ర మాత్రమే ఉండేలా చూస్తాను
ప్రేమకథలనే ప్రధానంగా ఎంచుకుని వాటిని దృశ్య కావ్యాలుగా ఆవిష్కరిస్తూ హను రాఘవపూడి యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. "మీరు దర్శకుడు మణిరత్నం స్టైల్ ను ఫాలో అవుతారని అంతా అనుకుంటూ వుంటారు .. అలా అనుకరించడం మానుకుంటే మంచి డైరెక్టర్ అవుతారనే టాక్ వినిపిస్తోంది .. దీనిపై మీరేమంటారు?" అనే ప్రశ్న హను రాఘవపూడికి ఎదురైంది.
అందుకు ఆయన స్పందిస్తూ .."ఇదే ప్రశ్నను చాలామంది అడిగారు. నిజం చెప్పాలంటే నా శైలికి .. మణిరత్నం గారి శైలికి టెక్నికల్ గా ఎలాంటి సంబంధం ఉండదు. మంచి పోలికే అయినా నాకు తెలిసి నాపై మణిరత్నం గారి ప్రభావం లేదు. కావాలని చెప్పేసి నేను అలా చిత్రీకరణ చేయడం లేదు. నా స్టైల్లో నేను తీసింది అలా అనిపిస్తుందేమో మరి. ఇక మీదట నా సినిమాపై నా ముద్ర మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడతాను" అని అన్నాడు.