Uttam Kumar Reddy: చంద్రబాబు వల్ల నష్టం జరగలేదు.. ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకపోవడం దారుణం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రోజులు గడిచిపోతున్నాయి
  • అసెంబ్లీని ఇంకా సమావేశపరచలేదు
  • పొత్తుల విషయంలో ముందుగా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా... ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకపోవడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని సమావేశపరచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని చెప్పారు. ఓటమిని సమీక్షించుకుని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంతో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో కొంత ముందుగా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Uttam Kumar Reddy
Chandrababu
kcr
  • Loading...

More Telugu News