Tirumala: తిరుపతిలో కిడ్నాప్ కలకలం.. ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు!

  • మహారాష్ట్ర నుంచి తిరుపతికి వచ్చిన జంట
  • మండపం నుంచి చిన్నారి కిడ్నాప్
  • రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తిరుపతిలోని మండపంలో నిద్రిస్తున్న ఓ చిన్నారిని కొందరు దుండగులు ఈరోజు కిడ్నాప్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన ఓ జంట శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలో తిరుపతిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న మండపంలో బస చేశారు. అయితే తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో ఏడాదిన్నర వయసు ఉన్న చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు.

అనంతరం మరికొందరితో కలిసి జీపులో పరారయ్యాడు. పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News