Uttam Kumar Reddy: ఎన్నికల సంఘంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు!

  • వీవీ పాట్ స్లిప్పులను లెక్కించాలంటూ కోర్టులకు వెళ్తున్నాం
  • వీవీ పాట్ స్లిప్పులను రిటర్నింగ్ అధికారులు తొలగిస్తున్నారు
  • ఈ వ్యవస్థను ఏమనాలో అర్థం కావడం లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి వీవీ పాట్ స్లిప్పులను లెక్కించాలని తాము కోర్టులకు వెళ్తుంటే... మరోవైపు రిటర్నింగ్ అధికారుల వీవీ పాట్ లలోని స్లిప్పులను తీసేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవస్థను ఏమనాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు.

ఈవీఎం లకు, వీవీ పాట్ లకు పోలింగ్ విషయంలో 1 శాతం తేడా ఉన్న కోదాడ, ధర్మపురి, ఇబ్రహీంపట్నంలలో వీవీ పాట్ స్లిప్పులు ఎందుకు లెక్కించలేదని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని... పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని మండిపడ్డారు.

Uttam Kumar Reddy
vv pot
election commission
  • Loading...

More Telugu News