yash: భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న 'కేజీఎఫ్'

  • యశ్ హీరోగా రూపొందిన 'కేజీఎఫ్'
  • పెరుగుతోన్న వసూళ్ల జోరు 
  • ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లు

కన్నడలో హీరోగా యశ్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' సినిమాను తెరకెక్కించాడు. కన్నడతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగులో ఇదే రోజున 'అంతరిక్షం' .. 'పడి పడి లేచె మనసు' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక హిందీలో ఇదే రోజున షారుక్ 'జీరో' సినిమా విడుదలైంది. అయినా ఈ రెండు భాషల్లోని గట్టి పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడింది. షారుక్ 'జీరో'నాలుగు రోజుల్లో 69 కోట్లు వసూలు చేస్తే, 'కేజీఎఫ్' నాలుగు రోజుల్లో 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను 5 కోట్లకి సాయి కొర్రపాటి కొనుగోలు చేయగా, ఇప్పటికే 6 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, తన జోరును మరింత పెంచుతుండటం విశేషం.

  • Loading...

More Telugu News