Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు షాక్ ఇచ్చిన కేంద్రం.. విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షో రద్దుచేస్తూ నిర్ణయం!

  • నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • రిహార్సల్స్ పూర్తయ్యాక రద్దుకు నిర్ణయం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గంటా

ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమయింది. ఈ వేడుకలను ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పలు క్రీడలు, జానపద నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో అలరించనున్న ఈ వేడుకలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

ఇక్కడ నిర్వహించే విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షోను కేంద్రం రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. దీంతో ఏపీపై కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందనీ, అందుకే వాయుసేన సిబ్బందిని రిహార్సల్స్ పూర్తి చేశాక వెనక్కు పిలిపించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాయుసేన సిబ్బంది విశాఖ ఉత్సవ్ లో పాల్గొనకుండా వెళ్లిపోవడానికి కేంద్రమే కారణమని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

  • Loading...

More Telugu News