manmohan singh: ‘మన్మోహన్ సింగ్’పై రూపొందిన సినిమా ట్రైలర్ విడుదల.. మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు!

  • యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ రిలీజ్
  • సోనియా, రాహుల్ కు వ్యతిరేకంగా ఉందన్న కాంగ్రెస్
  • ఆ సీన్లు తొలగించకుంటే అడ్డుకుంటామని వార్నింగ్

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించిన ఈ సినిమాను జనవరి 11న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల కావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నెగటివ్ షేడ్స్ లో చూపించారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం, ఓ దశలో మన్మోహన్ రాజీనామాకు సిద్ధపడటం సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించేలా సన్నివేశాలు ఉన్నాయని మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని ధ్రువీకరించేందుకు ఈ సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ కార్యవర్గ సభ్యులకు సినిమాను ముందుగా ప్రదర్శించి అవసరమైన మార్పులు చేయకుంటే దేశమంతటా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

manmohan singh
trailer
accidental prime minister
release
Congress
angry
  • Error fetching data: Network response was not ok

More Telugu News