vinaya vidheya rama: రాంచరణ్ సినిమా ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ స్పందన

  • గోల్డ్, డైమండ్స్ మిక్స్ చేస్తే ఈ సినిమా ట్రైలర్
  • రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాడు
  • చరణ్ కు బెస్ట్ విషెస్

రాంచరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవిలు హాజరయ్యారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. గోల్డ్, డైమండ్స్ మిక్స్ చేస్తే 'వినయ విధేయ రామ' ట్రైలర్ అంటూ వర్మ కితాబిచ్చారు. బోయపాటి ట్రైలర్ వావ్ అనిపించేలా ఉందని అన్నారు. రాం చరణ్ సింపుల్ గా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. చరణ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

vinaya vidheya rama
ram charan
Chiranjeevi
KTR
Boyapati Sreenu
ram gopal varma
rgv
tollywood
  • Loading...

More Telugu News