rajani: దుమ్మురేపేస్తోన్న 'పేట' ట్రైలర్

- రజనీ తాజా చిత్రంగా 'పేట'
- భారీ తారాగణంతో సందడి
- తమిళ .. తెలుగు భాషల్లో రిలీజ్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ 'పేట' సినిమా చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో జనవరి 10వ తేదీన తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజనీ .. సిమ్రాన్ .. త్రిష .. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
