Anantapur District: మదనపల్లి బైపాస్ రోడ్డు వద్ద.. ఏపీ అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా!

  • శబరిమలకు వెళ్లి వస్తున్న భక్తులు
  • మరికొన్ని గంటల్లో గమ్యం చేరుతామనగా ప్రమాదం
  • మదనపల్లి సమీపంలో బస్సు బోల్తా

శబరిమల యాత్రను ముగించుకుని తిరిగి వస్తూ, మరో రెండు మూడు గంటల్లో స్వగ్రామాలకు చేరతామన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు ప్రాంతానికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు, చిత్తూరు మదనపల్లి బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, 10 మందికిపైగా గాయపడ్డారు. బస్సు బోల్తా పడిన విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులోనివారిలో ఎక్కువమంది దిదిరెడ్డి పల్లి వాసులుగా తెలుస్తోంది.

Anantapur District
Chittoor District
Madanapalli
Road Accident
Bus
Ayyappa
  • Loading...

More Telugu News