Narendra Modi: అలా జరిగితే అంతా మోదీ ఖర్మ: జేసీ దివాకర్ రెడ్డి

  • తిత్లీని వణికించిన వేళ పలకరించని నరేంద్ర మోదీ
  • ఇప్పుడు ఏం చేద్దామని ఏపీకి వస్తున్నారు
  • భవిష్యత్తులో నష్టం తప్పదన్న జేసీ

ఆంధ్రప్రదేశ్ ను తిత్లీ వంటి తుపాను వణికించి, ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన వేళ, కనీసం వచ్చి ప్రజలను పలకరించని ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు ఏం చేద్దామని ఏపీకి వస్తున్నారని తెలుగుదేశం నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఓ ప్రాంత ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరించడం ప్రధానికి మంచిది కాదని, ఇప్పటికైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. పద్ధతి మార్చుకోకుంటే భవిష్యత్తులో ప్రధానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ఏదైనా నష్టం జరిగితే, అది ఆయన ఖర్మని అన్నారు. రాష్ట్ర ప్రజలకు విభజన సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాలని జేసీ డిమాండ్ చేశారు.

Narendra Modi
JC Diwakar Reddy
Titly
  • Loading...

More Telugu News