Gali janardhan reddy: గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దనరెడ్డిపై సిట్ చార్జిషీటు

  • చార్జిషీటులో ‘గాలి’ని ఏ1 ముద్దాయిగా పేర్కొన్న సిట్
  • లోకాయుక్త కోర్టుకు చార్జిషీట్
  • షేక్ సాబ్ మైనింగ్ భూమిలో అక్రమ తవ్వకాలు

కర్ణాటక మాజీ మంత్రి, గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం చార్జిషీటు సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్ట్ తీసుకున్న జనార్దన రెడ్డి అందులో అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు సిట్ ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని లోకాయుక్త కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. ఇందులో గాలి జనార్దనరెడ్డిని ఏ1 నిందితుడిగా, అలీఖాన్‌ను ఏ2గా, శ్రీనివాసరెడ్డిని ఏ3 నిందితుడిగా పేర్కొంది.

 కాగా, యాంబిడెంట్ ముడుపుల కేసులో గాలి జనార్దన రెడ్డిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాడుల నుంచి రక్షిస్తానంటూ ఓ వ్యాపారి నుంచి భారీగా లంచం తీసుకున్న కేసులో ‘గాలి’ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు.

Gali janardhan reddy
Karnataka
Minig
SIT
Court
Bangaluru
  • Loading...

More Telugu News