JC Diwakar Reddy: నువ్వు రెడ్ల పేరు చెప్పి తిరుగుతున్నావు.. నీ చెల్లెలు వివాహమాడింది బ్రాహ్మణుడినే కదా?: జగన్ పై జేసీ విసుర్లు

  • కుల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్న జగన్
  • పవన్, జగన్ సంకనాకిపోతారు
  • టీడీపీ ఎంపీ జేసీ నిప్పులు

"రెడ్డి... రెడ్డి... రెడ్డి..." అంటూ వైఎస్ జగన్ కుల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు అడ్డం రాని కులం, ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఎందుకని ప్రశ్నించిన ఆయన, సత్తా ఉంటే సీఎంలవుతారు తప్ప కులం పేరు చెప్పుకుంటే కాదని వైకాపా అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

 "మీ చెల్లెలు షర్మిల ఏ కులస్థుడిని వివాహం చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకుంది కదా? అందరూ ఒకటేనన్న భావనతోనే ఆమె పెళ్లి చేసుకుంది. నువ్వు రెడ్ల పేరు చెప్పి తిరుగుతున్నావు. రెడ్లు అయితే కొమ్ములున్నాయా?" అంటూ జేసీ నిప్పులు చెరిగారు. జగన్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా కులం పేరు చెప్పుకుంటున్నారని, ఇద్దరూ సంకనాకి పోతారని ఎద్దేవా చేశారు.

JC Diwakar Reddy
Sharmila
Jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News