India: పీకల్లోతు కష్టాలు... ఫాలో ఆన్ ప్రమాదంలో ఆసీస్!

  • 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్
  • ఫాలో ఆన్ తప్పాలంటే ఇంకా 141 పరుగులు చేయాల్సిందే
  • బుమ్రాకు దక్కిన మూడు కీలక వికెట్లు

మెల్ బోర్న్ లో ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 8/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ఆటగాళ్లలో ఎవరూ రాణించలేదు. దీంతో 41 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు 443 కాగా, ఆసీస్ ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 142 పరుగులు చేయాల్సివుంది. ఆసీస్ ఆటగాళ్లలో హారిస్ 22, ఫించ్ 8, ఖావాజా 21, ఎస్ఈ మార్ష్ 19, హెడ్ 20 ఎంఆర్ మార్ష్ 9 పరుగులు చేయగా, పైనీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కగా, జడేజాకు 2, ఇషాంత్ కు ఒక వికెట్ లభించాయి.

India
Australia
Cricket
  • Loading...

More Telugu News