Bhopal: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత శపథం.. 15 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన వైనం!

  • పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ చెప్పులు ధరించనని శపథం
  • ఇటీవలే అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్
  • సీఎం సమక్షంలో చెప్పులు ధరించిన దుర్గాలాల్

చీటికీమాటికీ నేతలు శపథాలు చేయడం.. ఆనక వాటిని విస్మరించడం పరిపాటే. కానీ భోపాల్‌లో ఒక నాయకుడు మాత్రం తాను చేసిన శపథాన్ని అక్షరాల పాటించాడు. 15 ఏళ్ల పాటు కాళ్లకు చెప్పుల్లేకుండా తిరిగి ఔరా అనిపించుకున్నారు. మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నేత దుర్గాలాల్ కిరా తాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకూ చెప్పులు ధరించనని 2003లో శపథం చేశారు.

ఆ మాట పైనే 15 ఏళ్ల పాటు చెప్పుల్లేకుండా తిరిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆయన శపథానికి ముగింపు చెప్పి.. ముఖ్యమంత్రి కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో చెప్పులు ధరించారు. ఈ విషయం గురించి కమల్‌నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు.

Bhopal
Durgalal Kira
Kamalnath
Digvijay Singh
Madhya Pradesh
  • Loading...

More Telugu News