Chandrababu: ఏపీకి అన్యాయంలో వెంకయ్యనాయుడు పాత్ర కూడా ఉంది: సి.రామచంద్రయ్య

  • ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు
  • బాబు వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది
  • సీఎం రమేష్ ను బ్రోకర్ లా వాడుకుంటున్నారు

ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో భయపడి విజయవాడకు పారిపోయారని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందని విమర్శించారు. అయితే, రాష్ట్రానికి మొదటి శత్రువు చంద్రబాబేనని... ఆయన వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. తన అనుచరులకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లను దండుకుంటున్నారని అన్నారు. ఎంపీ సీఎం రమేష్ ను ఒక బ్రోకర్ లా వాడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో వైసీపీ నేతలు చేపట్టిన 'వంచనపై గర్జన' దీక్షలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Chandrababu
Venkaiah Naidu
Jagan
c ramachandraiah
special status
  • Loading...

More Telugu News