himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ నా ఇంటిలాంటిది: మోదీ

  • ఎన్నో ఏళ్లు హిమాచల్ ప్రదేశ్ లో పని చేశా
  • ఎన్నో విషయాలను నేర్చుకున్నా
  • ధైర్య సాహసాలు కలిగిన సైనికుల గడ్డ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన ఇంటిలాంటిదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ప్రయాణిస్తూ ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. హిమాచల్ లో జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తనతో పాటు పని చేసిన వ్యక్తులు ఇప్పుడు కీలక నేతలుగా ఎదగడం సంతోషకరంగా ఉందని చెప్పారు. ధైర్యసాహసాలు కలిగిన సైనికుల గడ్డ హిమాచల్ ప్రదేశ్ అని... సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం వీరంతా ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారని కితాబిచ్చారు.

ఈ సందర్భంగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి ఠాకూర్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ తనకు ఇంటిలాంటిదని... రాష్ట్రంలో పార్టీని నిర్మించే క్రమంలో గతంలో తాను ఇక్కడ ఎన్నో ఏళ్లు పని చేశానని చెప్పారు.

himachal pradesh
modi
bjp
jai ram thakur
  • Loading...

More Telugu News