Chandrababu: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరిపాలన భవనాలను నిర్మిస్తున్నాం: చంద్రబాబు

  • కడప స్టీల్ ప్లాంట్, సచివాలయానికి ఒకే రోజు శంకుస్థాన చేయడం ఆనందకరం
  • 16వేల మంది విధులు నిర్వర్తించేలా నిర్మాణం
  • రేపటి నుంచి నిరంతరాయంగా నిర్మాణ పనులు

తన జీవితంలో ఈరోజు మరిచిపోలేని రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో సచివాలయ శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒకే రోజు రెండు కీలకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారం, సచివాలయ భవనాలకు ఒకే రోజు శ్రీకారం చుట్టడం ఆనందకరమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరిపాలన భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. అత్యంత ఆధునిక, సాంకేతికతలతో నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. రేపటి నుంచి సచివాలయం నిర్మాణ పనులు నిరంతరాయంగా జరుగుతాయని చెప్పారు.

16 వేల మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించేలా నిర్మాణాలను చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతికి భూములిచ్చిన రైతులను ఆయన కొనియాడారు. రైతుల వల్లే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇది ప్రజా రాజధాని అని... ప్రతి ఒక్కరికీ ఇక్కడ చోటు ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News