annam satish: వైసీపీ నేతలు నాపై కుట్రలు చేస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్

  • తాను కొనుగోలు చేసిన భూమిలో అవినీతి చోటుచేసుకోలేదు
  • అధికారులు ఇదే విషయాన్ని తేల్చారు
  • జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మడం లేదు

తనపై కుట్రలకు పాల్పడుతూ, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ మండిపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలో అపోహలను సృష్టించి, తనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని అధికారులు తేల్చారని... అయినా, వైసీపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

annam satish
Telugudesam
mlc
YSRCP
  • Loading...

More Telugu News