అల్లు శిరీశ్ మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- మలయాళ చిత్రానికి రీమేక్
- దర్శకుడిగా సంజీవ్ రెడ్డి
ఈ సినిమాకి నిర్మాత సురేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరించనున్నారనే విషయాన్ని అల్లు శిరీశ్ స్వయంగా తెలియజేశాడు. రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. మలయాళంలో చేసిన దుల్కర్ సల్మాన్ కి ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీశ్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.