vijay devarakonda: బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ

  • '83' చిత్రంలో విజయ్ కు అవకాశం
  • భారీగా ఎత్తున ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న విజయ్
  • విజయ్ తో కరణ్ జొహార్ చర్చలు

వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న '83' అనే చిత్రంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను పోషించే అవకాశం విజయ్ కు వచ్చిందట. కానీ, ఆ ఆఫర్ ను విజయ్ సున్నితంగా తిరస్కరించాడు.

వాస్తవానికి బాలీవుడ్ లోకి ఒక రేంజ్ లో ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో విజయ్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో, తన తొలి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడం ఇష్టం లేక... ఆఫర్ ను విజయ్ తిరస్కరించాడట. మరోవైపు విజయ్ తో ప్రముఖ సినీదర్శకుడు కరణ్ జొహార్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. అంతా ఓకే అయితే, ఇద్దరూ కలసి ఒక భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. 

vijay devarakonda
bollywood
entry
tollywood
ranveer singh
Karan Johar
  • Loading...

More Telugu News