Telugudesam: టీడీపీలోకి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు!

  • ముఖ్యమంత్రిని కలిసిన కాండ్రు కమల
  • టీడీపీలో చేరేందుకు ఆసక్తి
  • మంచి రోజు చూసుకుని చేరాలన్న చంద్రబాబు

మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. తన వియ్యంకుడు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుతో కలిసి చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్న ఆమె.. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. పార్టీలో చేరి పనిచేయాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఓ మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా తనకు పార్టీలో తగిన గుర్తింపు కల్పించాలని కోరగా, చంద్రబాబు వెంటనే నవ్వుతూ ..‘మీరు సీనియర్..  పార్టీలో మీ స్థాయికి తగ్గ గుర్తింపు, గౌరవం ఉంటాయి’ అని జవాబిచ్చారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయినందున రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల తెలిపారు.

Telugudesam
ex mla
mangalagiri
green signal
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News