SV Mohan Reddy: లీగలైనా, ఇల్లీగలైనా వెనక్కు తగ్గేదే లేదు: వర్మకు ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్!

  • మోహన్ రెడ్డికి నోటీసులు పంపిన వర్మ
  • ఫిర్యాదును వెనక్కు తీసుకునే పనే లేదు
  • మీడియాతో ఎస్వీ మోహన్ రెడ్డి

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంపిన లీగల్ నోటీసులపై తెలుగుదేశం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఉదయం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే రకాన్ని కాదని అన్నారు.

రామ్ గోపాల్ వర్మ లీగల్ గా వచ్చినా, ఇల్లీగల్ గా వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్న వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన, వర్మ సినిమాను విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. కాగా, వర్మ తన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో వెన్నుపోటు పాటను విడుదల చేసిన తరువాత, ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. 

SV Mohan Reddy
Ramgopal Varma
Legal Notice
Police
  • Loading...

More Telugu News