jayalalitha: బెంగళూరు జైల్లో జయ ఎంతో ఇబ్బంది పడ్డారు: తంబిదురై

  • జయ మరణానికి డీఎంకే వేసిన కేసే కారణం
  • నిర్దోషిగా విడుదలైనా.. అప్పీల్ చేసి మళ్లీ జైలుకు పంపారు
  • జైల్లో జయ ఎంతో కష్టపడ్డారు

అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణానికి డీఎంకే కారణమని ఆయన ఆరోపించారు. డీఎంకే వేసిన కేసు వల్లే జయ మృతి చెందారని చెప్పారు. డీఎంకేకు కాంగ్రెస్ సహకరించిందని మండిపడ్డారు. బెంగళూరు జైల్లో జయ ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆ తర్వాత జయ నిర్దోషిగా విడుదలయ్యారని, అయినా అప్పీల్ చేసి మళ్లీ జైలుకు పంపారని చెప్పారు.

మేకెదాటులో ఆనకట్టను నిర్మించాల్సిన అవసరం లేదని... దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారీకి కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతించిందో అర్థం కావడం లేదని తంబిదురై అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. దేశ ప్రధానిని ఎంపిక చేయడంలో అన్నాడీఎంకే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

jayalalitha
thambidurai
aiadmk
dmk
  • Loading...

More Telugu News