siddharth: హిందీ హిట్ మూవీ తమిళ రీమేక్ లో హీరో సిద్ధార్థ్

  • హిందీలో హిట్ కొట్టిన 'అంధధూన్'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • 110 కోట్లకి పైగా వసూళ్లు

తెలుగు .. తమిళ భాషల్లో హీరో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక తమిళంలో మాత్రం కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ కి మంచి అవకాశం ఒకటి వచ్చినట్టుగా తెలుస్తోంది. హిందీలో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో 'అంధధూన్' టాప్ 10 చిత్రాలలో స్థానాన్ని సంపాదించుకుంది.

ఆయుష్మాన్ ఖురానా .. టబు .. రాధికా ఆప్టే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. 30 కోట్లతో నిర్మితమైన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్, 110 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News